Wednesday, July 31, 2019

నెవెర్ బిఫోర్ : సినీ అభిమానుల కు పండగే ఇక:హృతిక్ , టైగర్ ష్రాఫ్ ల "వార్ "-ట్రైలర్.



ఇండియా లో బెస్ట్ డాన్సర్ ఎవరు..? అంటే టక్కున గుర్తొచ్చే పేర్లలో ముందుగా గుర్తొచ్చే పేరు హృతిక్ రోషన్.ఈ మధ్య కాలం లో హృతిక్ ని డాన్స్ లో మరిపించింది ఎవరైనా ఉన్నారా అంటే అది తప్పకుండా టైగర్ ష్రాఫ్ అని చెప్పొచ్చు.అతనిలో హృతిక్ లాగా    కళాత్మకంగా డాన్స్ చేయడమే కాదు,హై ఎనర్జీ తో స్టెప్స్ వేయడమే కాదు,అద్భుతమైన ఆక్రోబాట్స్ కూడా చేయగలడు గ్రేట్ అథ్లెటిక్ బాడీ,ఆరు ఫలకల దేహం..వెరసి చూస్తే టైగర్ ష్రాఫ్..ఇలాంటి ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే సినిమాలో నటిస్తే,ఫైట్స్ చేస్తే...అన్నిటికన్నా ముఖ్యంగా కలిసి ఒకే పాటకి డాన్స్ చేస్తే...అబ్బబ్బ...ఆ కిక్కే వేరు..ఇలాంటివన్నీ ఒకే సినిమాతో తీరబోతున్నాయి.. అదే ..."WAR" సినిమా.
యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు సిద్దార్థ్ ఆనంద్ డైరెక్టర్ గా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2 న విడుదల కాబోతుంది.దీనికి సంగీతం విశాల్ -శేఖర్.వాణీ కపూర్ హీరోయిన్.
హై voltage action డ్రామా గా రాబోయే ఈ సినిమా ట్రైలర్ ని ఒక్కసారి చూడండి..

0 comments:

Post a Comment