Sunday, June 9, 2019

గబ్బర్ శతకం : ఆస్ట్రేలియా పై భారత్ ఘనవిజయం: క్రికెట్ వరల్డ్ కప్.


లండన్-ఓవల్ గ్రౌండ్స్ : ఐసీసీ టోర్నీల్లో ,ఆస్ట్రేలియా పై భారత్ కున్న పాత రికార్డ్ ప్రకారం,ఆస్ట్రేలియా పై భారత్ గెలుస్తుందో లేదో అని సగటు అభిమాని భయపడ్డప్పటికీ,ఆ భయాలను పటాపంచలు చేస్తూ ,బ్యాటింగ్ ,బౌలింగ్,ఫీల్డింగ్ లలో అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు ,ఆస్ట్రేలియా పై 36 పరుగుల తేడా తో విజయదుందుభి మోగించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ,ఆది నుండి ఆచి తూచి ఆడింది.25 ఓవర్ల వరకు నెమ్మదిగా ఆడింది. రోహిత్ 57,కోహ్లీ 82లు సమయోచితంగా ఆడగా,పాండ్యా, ధోనీ లు వేగంగా ఆడారు.
మధ్యలో రోహిత  ఔట్  అయినప్పటికీ, కోహ్లీ కూడా ఎంతో సమన్వయం తో ఆడాడు.ఇక ఐసీసీ టోర్నీల్లో చెలరేగి ఆడే "గబ్బర్"-శిఖర్ ధావన్ ఈ మాచ్ లో కూడా  అద్భుతమైన సెంచరీ సాధించాడు.(117 పరుగులు).   భారత్ ఈ మ్యాచ్ లో తన పూర్తి స్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ కూడా చాలా ఓపిక గా ఆడినప్పటికీ ,ఓవర్లు గడుస్తున్న కొద్దీ ,రన్ రేట్ పెరిగి,ఒత్తిడికి లోనయ్యి వికెట్లను చేజార్చుకున్నారు.భారత బౌలర్లలో భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.అతడు తక్కువ పరుగులు ,ఇవ్వడమే కాకుండా,3 వికెట్లను తీశాడు.భుమ్రా కొంచెం ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ కొన్ని అద్భుతమైన ఓవర్లు వేశాడు.ముఖ్యంగా చివరి స్పెల్ లో స్టాయినిస్ కి వేసిన ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడం అతడి నైపుణ్యానికి నిదర్శనం.స్పిన్నర్లు పెద్దగా ఆకట్టుకొనప్పటికీ వారి పాత్రను కూడా తోసిపుచ్చలేము.ముఖ్యంగా చాహల్ ,డేంజరస్ మాక్స్ వెల్ వికెట్ తీయడం,అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
భారత్ బౌలింగ్:
Man of the match




visit for more updates
www.thribhuvanavijayam.com

0 comments:

Post a Comment