Monday, June 3, 2019

హాట్ ఫేవరేట్ ఇంగ్లాండ్ కు షాకిచ్చిన పాక్:ఇంగ్లాండ్ ఓటమి:క్రికెట్ ప్రపంచ కప్

ప్రపంచ కప్ లో నిన్న జరిగిన లీగ్ మాచ్ లో పాకిస్థాన్ జట్టు,ఇంగ్లాండ్ ను ఓడించింది.ప్రపంచ నంబర్ వన్ జట్టు మరియు టోర్నీ లో హాట్ పేవరేట్ అయిన ఇంగ్లాండ్ ,సొంత గడ్డ పై ఓడిపోయింది.పాక్ బౌలర్లు తమ భారీ స్కోరు 348 ని కాపాడు కోవడానికి శ్రమించాల్సి వచ్చింది.తొలుత బ్యాటింగ్ చెందిన పాక్ జట్టు నిర్ణీత ఓవర్ల లో 348 పరుగులు చేయగా ,ఇంగ్లాండ్ జట్టు లక్ష్యాన్ని ఛేదించలేక 334 పరుగులకే       చతికిల పడింది. పాక్ జట్టులో హఫీజ్ 84,బాబర్ 63,కెప్టెన్ సర్ఫరాజ్ 55 లు   రాణించారు. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 107, జాస్ బట్లర్ 103 సెంచరీలు చేసినప్పటికీ రన్ రేట్ లో వెనకబడి 14 పరుగుల తేడా తో ఒడి పోయింది.
మాన్ ఆఫ్ ద మాచ్ మొహంమ్మద్ హఫీజ్

0 comments:

Post a Comment