Sunday, June 2, 2019

సౌతాఫ్రికా పై బాంగ్లాదేశ్ చిరస్మరణీయ విజయం : క్రికెట్ ప్రపంచ కప్



ప్రపంచ కప్ 2019 లో నిన్న ఓవల్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ అద్భుతమైన ప్రదర్శన తో పెద్ద జట్టు అయిన సౌతాఫ్రికా పై సంచలన విజయాన్ని నమోదు చేసింది.మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా బంగ్లా బ్యాట్స్ మన్  లను కట్టడి చేయలేక పోయింది.బంగ్లా దేశ్ బ్యాట్స్ మన్ సమిష్టి గా ఆడి 50 ఓవర్ల లో 6 వికెట్లు నష్టపోయి   330  పరుగుల భారీ స్కోరు సాధించింది. బంగ్లా టీమ్ కి ఇదే అత్యధిక  వన్డే టీమ్ స్కోర్.
బంగ్లా బ్యాట్స్ మన్ ల లో షకీబల్  హసన్ 75 ,ముష్పికర్ 78,మహమ్మదుల్లా 46 నాటౌట్ లు రాణించారు.అనంతరం బ్యాటింగ్  కి దిగిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 309 పరుగులు ఆలౌట్ అయింది. కెప్టెన్ డూప్లెసిస్ 65,మార్క్ రామ్ 45,డుమినీ 45 పరుగులు చేశారు.బంగ్లా బౌలర్ల లో ముస్తాఫిజుర్ 3,  సైఫుద్దీన్ 2 వికెట్లు తీశారు. మాన్ ఆఫ్ ద మాచ్ - షకీబల్ హసన్.

0 comments:

Post a Comment